పిల్లల పెరుగుదల సమయంలో కనిపించే సాధారణ ఆర్థోపెడిక్ (ఎముకల) సమస్యలు ఏమిటి?
Nov 29, 2022
పిల్లల పెరుగుదల సమయంలో కనిపించే సాధారణ ఆర్థోపెడిక్ (ఎముకల) సమస్యలు ఏమిటి? మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఎముకలు & కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సమగ్రమైన అంచనాతో, రోగ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తాము. ఆర్థోపెడిక్ సమస్యలైన విల్లు కాళ్ళు (కాళ్ళ ఎముకలు ధనుస్సు ఆకారంలో వంగి పోవడం), వంకర మోకాళ్లు, కాలి నడకలో చదునైన పాదాలు వంటి సమస్యలు పిల్లల్లో సర్వసాధారణం. అయితే వీటిలో కొన్ని సమస్యలు పిల్లలు పెరిగేకొద్దీ తగ్గిపోతాయి కానీ కొన్ని సమస్యలకు చికిత్స అవసరం. పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రుల శ్రద్ధ అవసరం. పైన పేర్కొన్న సమస్యల లక్షణాలు పిల్లల్లో గుర్తిస్తే.. అవి తగ్గుముఖం పడుతున్నాయా? లేదా పెరుగుతున్నాయా? అనే విషయాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనించాలి. ఒక వేళ సమస్య ఎక్కువ అవుతున్నట్టు అనిపించినా లేదా తగ్గుతున్నట్టు అనిపించకపోయినా సకాలంలో రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ను సంప్రదించాలి. పిల్లలలో వంకర మోకాలు & విల్లు కాళ్ళు అంటే ఏమిటి? వంకర మోకాలు (genu valgum) – పిల్లలు నిటారుగా నిలబడి మోకాళ్లు తాకినప్పుడు కానీ చీలమండలు వేరుగా ఉంటాయి. విల్లు కాళ్ళు (genu varum) - పిల్లల కాలి వేళ్లు ముందుకు చూపినప్పుడు, వారి చీలమండలు తాకవచ్చు కానీ వారి మోకాలు వేరుగా ఉంటాయి. వంకర మోకాలు & విల్లు కాళ్ళు సమస్యకు కారణాలు ఏమిటి? * పుట్టుకతో వచ్చే శారీరక సమస్యలు *రికెట్స్ (విటమిన్ డి లేదా కాల్షియం లోపం- కిడ్నీ సంబంధిత కారణాలు) *ఇన్ఫెక్షన్ లేదా ఫ్రాక్చర్ పెరుగుదల మోకాళ్ల వద్ద ఆగిపోవడం *ఊబకాయం, సిండ్రోమిక్ చైల్డ్, అరుదుగా ఏర్పడే కణితులు మొదలైనవి *బ్లౌంట్ వ్యాధి (విల్లు కాళ్ళు ఏర్పడడానికి కారణం) తల్లిదండ్రులు ఏం చేయాలి? మీ పిల్లలలో గుర్తించిన వైకల్యం లేదా ఎముకల సమస్య కాలక్రమేణా పెరిగినా, పిల్లలు నడుస్తున్నప్పుడు ఇబ్బంది పడడం, తరచుగా పడిపోవడం లేదా పరిగెత్తడంలో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా పిల్లల ఆర్థోపెడిషియన్ను సంప్రదించమని మేము సూచిస్తున్నాము. వంకర మోకాలు & విల్లు కాళ్ళ సమస్యను ఎలా నిర్ధారించాలి? పిల్లలని ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత, ఒక పిల్లల వైద్యుడు ఆర్థోపెడిషియన్ కాళ్ల యొక్క ఎక్స్-రే తీయడం కోసం సూచించవచ్చు. ఇది వైకల్యానికి కారణమవుతుందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? ఇలాంటి సమస్యలున్నా చాలా మంది పిల్లలకు చికిత్స అవసరం లేదు కానీ క్రమమైన పద్దతిలో నిరంతర పర్యవేక్షణ అవసరం. ఇది సాధారణంగా వాటంతట అవే సరిదిద్దబడతాయి. విటమిన్ డి లోపం వంటి వాటికి చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు లెగ్ బ్రెసెస్ (పట్టీలు) వాడడం ద్వారా తగ్గించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స అవసరం? సాధారణంగా గుర్తించడం ఆలస్యమైనా, చికిత్స అందించడం ఆలస్యంగా జరిగినా.. 8 గైడెడ్ గ్రోత్ ప్లేట్లను ఉంచడం ద్వారా తాత్కాలిక పరిష్కారం అందించవచ్చు. దీని ద్వారా పిల్లలు వెంటనే వారి కాళ్లపై బరువు వేస్తూ నడవవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత కొన్ని వారాలలో తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చు. పిల్లల్లో ఎదుగుదల ఆగిపోయినప్పుడు లేదా వైకల్యం అధికంగా ఉన్నప్పుడు Corrective Osteotomy (ఎముకను కట్ చేసి శస్త్ర చికిత్స అందించడం) ద్వారా పరిష్కారం అందించవచ్చు. శస్త్రచికిత్స చేయకుండా పరిష్కారం పొందవచ్చా? చికిత్స అవసరం ఏమిటి? పొట్ట దిగువ భాగంలోని రెండు దిగువ అవయవాలు మొత్తం నేరుగా/బాగా సమానంగా ఉండేలా చేయాలి. ఇలా చికిత్స చేయకపోతే, ఈ అంతర్లీన వైకల్యం మోకాలి కీలుకు హాని కలిగించవచ్చు. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ కు దారితీస్తుంది. మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఎముకలు & కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సమగ్రమైన అంచనాతో, రోగ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తాము. ఇది మీ పిల్లల భవిష్యత్తు ఎదుగుదలకు ఆటంకం కాకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.
Cancer is often thought to be a disease of adults. Unfortunately, cancers are also seen in children but what is fortunate is the treatment and outcomes. Yes, most of the cancers in children are curable if treated effectively with adequate supportive care.Globally around
Tue,
22-Aug-2023Centre of Excellence,Branch,Speciality,Doctor
Preventing infectious illnesses in newborns and children, including preterm neonates, requires vaccinations. 10% of Indian births are preterm less than 37 weeks gestation (WHO,2023). Premature babies may have compromised immune systems. Premature newborns are more prone